నిశ్శబ్ద మహమ్మారి: క్యాన్సర్‌గా మారుతున్న కుటుంబ సంబంధాలు
నిశ్శబ్ద మహమ్మారి: క్యాన్సర్‌గా మారుతున్న కుటుంబ సంబంధాలు
క్యాన్సర్ ఈ పేరు వింటేనే గుండెల్లో ఒక వణుకు పుడుతుంది. అది శరీరంలో ఎక్కడో ఒక చిన్న కణంగా మొదలై, ఎవరికీ తెలియకుండా నిశ్శబ్దంగా ఎదుగుతూ, చివరికి ప్రాణాధారమైన అవయవాలన్నింటినీ కుళ్ళింపజేసి మనిషిని బలి తీసుకుంటుంది. నొప్పి తెలియకముందే ప్రాణాన్ని తినేస్తుంది. ఈ రోజు మన సమాజంలో అత్యంత బాధాకరమైన నిజం ఏంటంటే ఒకప్పుడు ప్రాణపదంగా చూసుకున్న మన కుటుంబ బంధాలు, అనురాగాలు కూడా సరిగ్గా ఇలాంటి క్యాన్సర్‌లాగే మారిపోతున్నాయి. కుటుంబాల్లో కూడా చిన్న చిన్న అహంకారాలు, మాటలు, చిన్న అపార్థాలు, చిన్న నిర్లక్ష్యాలు, ఇవే చివరికి ప్రేమను చంపేస్తున్నాయి.
పైకి అంతా బాగున్నట్టు నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల బంధాలన్నీ కుళ్ళిపోతున్నాయి. ఒకే ఇంట్లో ఉంటారు, కానీ ఒకరి హృదయ స్పందన మరొకరికి వినిపించదు. ఈ నిశ్శబ్ద విచ్ఛిన్నం గుండెల్లో కలిగించే, నొప్పి వర్ణనాతీతం. తండ్రి సంపాదిస్తున్నాడు, కానీ పిల్లల హృదయాలను కోల్పోతున్నాడా? తల్లి వంట చేస్తోంది, కానీ తన కన్నీళ్లు ఎవరికైనా కనిపిస్తున్నాయా? భార్యాభర్తలు ఒకే మంచంపై పడుకుంటున్నారు, కానీ వారి మనసులు మైళ్ల దూరంలో ఉన్నాయా?
Comments
Post a Comment